రాజాసింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం.. కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్ఈసీకి ఆదేశం
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారం, ర్యాలీలు, మీడియా ఇంటర్వ్యూలపై 72 గంటలపాటు నిషేధం విధించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా రాజాసింగ్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గత బుధవారం వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విధించిన గడువు లోపల వివరణ ఇవ్వకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే, ఇంతకు ముందు జారీ చేసిన నోటీసులపై ఆయన తరఫు న్యాయవాది కే ఆంథోనీరెడ్డి ఈసీని సంప్రదించి.. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మరోసారి గడువు ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఈసీ తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో రికార్డింగ్‌ను పరిశీలించామని, ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా, భయపెట్టేలా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

