హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : మహిళాశిశు సంక్షేమశాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీవో) ఫలితాలు విడుదలయ్యా యి. పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. జనవరి 3, 4న పరీక్షలు నిర్వహించగా, అభ్యర్థుల రెస్పాన్ష్షీట్లు, పైనల్ ‘కీ’, జీఆర్ఎల్ ను వెబ్సైట్లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా మంగళవారం నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30గంటల నుంచి నాంపల్లిలోని టీజీపీస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని, హాజరుకాని వారికి..19న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు.