హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ఆర్, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను ఆదాయం పెంచాలని, ఈ నెలాఖరు వరకు గరిష్ఠంగా వసూళ్లు చేయాలని సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
గురువారం ట్రిపుల్ ఆర్ పరిధిలోని 15 మున్సిపాలిటీల కమిషనర్లతో డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నాగారంలో 42 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో అప్పటి ఆర్డీవో వెంకటాచారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం విచారించింది. ఇటీవల ఐఏఎస్ అమోయ్‌కుమార్, తహసీల్దార్ జ్యోతి ఇచ్చిన సమాచారంతో ఆర్డీవో వెంకటాచారిని విచారించారు. భూదాన్ బోర్డుకు చెందిన 50 ఎకరాల భూమిని ఖాదురున్నీసాకు అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆర్డీవోను ఈడీ ప్రశ్నించింది.