వికారాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తునికాకు బోనస్ స్వాహా విషయంలో వికారాబాద్, తాండూరు ఎఫ్ఆర్వోలను సస్పెండ్ చేస్తూ బుధవారం సీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2017లో తునికాకుకు సంబంధించిన బోనస్ 2024 మేలో అటవీ శాఖ జమ చేసింది.
రూ.10 లక్షల వరకు వచ్చిన బోనస్‌ను తునికాకు రైతుల ఖాతాల్లో జమ చేయకుండా, తమకు సంబంధించిన వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసుకోవడంతో వికారాబాద్, తాండూరు ఎఫ్ఆర్వోలు అరుణ, శ్యాంసుందర్‌పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బోనస్ దుర్వినియోగంపై కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.