TG Assembly | తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలకు కుల గణన సర్వే రోడ్‌మ్యాప్‌లాంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో కుల గణన సర్వే నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చర్చ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. 1931 సరైన నివేదికలు లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే నివేదిక ఇవాళ అసెంబ్లీకి వచ్చిందన్నారు. సమాచారానికి సంబంధించి ఇంకా ఏమైనా సర్వే చేయాల్సి ఉంటే.. ఇంకా బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరారు.
ప్రతీది రాజకీయం చేయొదని.. ఇది బలహీన వర్గాల ఆకాంక్ష అని పేర్కొన్నారు. తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతీ జిల్లాల్లో ఇవాళ స్వేచ్ఛగా.. ఆకాంక్షను సంఘాలు, మేథాలు వెలిబుచ్చాల్సిన అవసరం ఉందన్నారు. చాలాకాలంగా కుల గణన కోసం డిమాండ్ చేస్తున్న వారి ఆకాంక్ష నెరవేరిందన్నారు. జనాభా సమాచారాన్ని తీసుకొని భవిష్యత్‌లో ఆయా వర్గాలకు ఎలాంటి న్యాయం చేయాలో చేస్తామన్నారు. బలహీన వర్గాల శకం నేటి నుంచి ప్రారంభమైందన్నారు. భవిష్యత్‌లో వారి అభ్యున్నతి కోసం పాటుపడుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదిక ఈ దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు.
బలహీన వర్గాల తరఫున గొంతెత్తి.. వారికి న్యాయం చేయాలని చెప్పే ప్రతి రాజకీయ పార్టీ స్వాగతించి.. భవిష్యత్ ప్రణాళికలకు సలహాలు ఇచ్చి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు. నివేదికపై చర్చించి సూచనలు ఇచ్చి రోడ్‌మ్యాప్‌ను నిర్ణయిస్తే.. భవిష్యత్‌లో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామన్నారు. భావితరాలకు న్యాయం చేయడానికి సమగ్ర వివరాల సేకరణ జరిగిందని.. బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందన్నారు.