హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): క్యాసి నో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో క్యాసినోలు నిర్వహించి భారీ మొత్తంలో హవాలా లావాదేవీలు జరిపారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు వీరి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విష యం తెలిసిందే. గత నెల నేపాల్‌లో క్యాసినో నిర్వహణకు సంబంధించి పలు కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు.. సోమవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డికి నోటీసులు ఇచ్చారు. తెలుగు రాష్ర్టాల నుంచి పంటర్ల(జూదగాళ్లు)ను క్యాసినోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలను బుక్ చేసేందుకు, వారికి నేపాల్‌లో బస, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన డబ్బును అక్కడికి ఎలా తరలించా రు? నేపాల్ క్యాసినోలో పంటర్లు గెలుచుకొన్న సొమ్మును ఇక్కడికి ఎలా తెచ్చారు? అనే అంశాలపై అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తున్నది. ప్రవీణ్‌తో సం బంధాలున్న కొందరు హవాలా ఏజెంట్ల కార్యాలయా ల్లో సోదాల సందర్భంగా సేకరించిన కీలక పత్రాలు, వారి లావాదేవీల అంశాలపై కూడా ప్రవీణ్, మాధవరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.