కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై కేసుల కొట్టివేత
తెలంగాణ పోరాటంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్‌రావుపై నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోరాటంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్‌రావుపై నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా దాడి చేశారంటూ జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్ కేటీఆర్ హరీశ్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ కే సుజన విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు.
కేసు దర్యాప్తు సందర్భంగా ఫిర్యాదుదారులు పిటిషనర్లను గుర్తించలేదని, అందువల్ల వానే అకడ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పిటిషనర్లపై ఉన్న కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

