జగిత్యాల: యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై (Mallik Tej) లైంగికదాడి కేసు నమోదయ్యింది. మాయ మాటలు చెప్పి లొంగదీసుకుని ఆత్యాచారం చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని అందులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మల్లిక్ తేజ్‌పై జగిత్యాల పట్టణ పోలీసులు రేప్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తనతోపాటు తన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడాడని వెల్లడించింది. తనకు సంబంధించిన యూట్యూబ్ చానల్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు, పాస్వర్డ్ మార్చి తనను మానసింగా వేధిస్తున్నాడని తెలిపింది. స్టూడియోలో పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది.
ఇటీవల సోషల్ మీడియా సెలబ్రెటీలపై లైంగిక దాడుల కేసులు నమోదవుతున్నాయి. ఫేమస్ యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి అత్యాచార ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసునమోదైంది. ప్రస్తుతం నార్సింగి పోలీసుల అదుపులో ఉన్న ఆయనను విచారిస్తున్నారు.