హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్లో విక్రయించారన్న ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానంపై తిరుమల రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బెంగళూరుకు చెం దిన సాయికుమార్ అనే భక్తుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫారసు లేఖపై తనకు ఆరు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ.65వేలకు విక్రయించారని సాయికుమార్ టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
బ్లాక్లో వీఐపీ టికెట్లు విక్రయించినట్టు నిర్ధారణ కావడంతో టీటీడీ విజిలెన్స్ వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు లో ఏ1గా జకియా పీఏ చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా పీఆర్వో కృష్ణతేజ పేర్లను చేర్చారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తాను టీడీపీలో చేరబోతున్నానని తెలుసుకొని వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.