హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీలకు ఏఐఎస్-ఐపీఎస్ ఇతర ఆలిండియా సర్వీ స్ క్యాడర్ అధికారుల కేటాయింపులపై దాఖలైన కేసులను జూన్ 5న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఉమ్మ డి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర సర్వీస్ అధికారుల విభజన జరిగింది. ఈ కేటాయింపుల తీరును తప్పుపడుతూ కొందరు అధికారులు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్లపై బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. అత్యవసర విచారణ అవసరం లేదని, విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.