Lagacharla | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : లగచర్ల ఘటనలో రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లు సృష్టించడం వంటి ఘటనలకు సంబంధించి 46 మంది రైతులపై హత్యాయత్నంతో పాటు ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 191(2)(3), 132, 109, 121(1), 126(2), 324(4) ఆర్/డబ్ల్యూ 190, సెక్షన్ -3 కింద కేసులు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వికారాబాద్ డీఎస్సీ ఎన్ శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుద్యాల మండలం లగచర్లలో తెలంగాణ ఇండ్రస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) కోసం భూసేకరణకు సంబంధించి లగచర్ల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 11న ఉదయం 11 గంటలకు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు ఇన్చార్జి కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల తహసీల్దార్ కిషన్ నాయక్, కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి వచ్చారు.
అక్కడికి వచ్చిన బోగనేని సురేష్ అభిప్రాయ సేకరణ మీటింగ్‌ను గ్రామంలో నిర్వహించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన కలెక్టర్, ఇతర అధికారులు గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే ముందుస్తు ప్రణాళికలో భాగంగా లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండా గ్రామస్థులు కర్రలు, రాళ్లు, కారంపొడి పోగేసి అక్కడ గుమిగూడారు. కలెక్టర్‌తో పాటు అధికారులు గ్రామంలోకి రాగానే నినాదాలు చేశారు. కలెక్టర్, ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి కారులోంచి దిగగానే వెంకట్‌రెడ్డిపై రైతు లు దాడికి దిగారు. కలెక్టర్‌పై కూడా దాడి జరిగే ప్రమాదం ఉన్నదని గ్రహించిన ఇతర ఉద్యోగులు కలెక్టర్‌ను కారులోకి తీసుకెళ్లారు. గ్రామస్థుల దాడి లో కడా ప్రత్యేకాధికారికి గాయాలు కాగా పోలీస్ అధికారులకూ గాయాలైనట్టు రిపోర్ట్లోపేర్కొన్నారు.
గ్రామస్థులపై పెట్టిన కేసులు..