కాంగ్రెస్ నేతలపై కేసు కొట్టివేత
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కాం గ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శులు పీ విష్ణువర్ధన్, మన్సూర్అలీఖాన్పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కాం గ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శులు పీ విష్ణువర్ధన్, మన్సూర్అలీఖాన్పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 నవంబరు 22న కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో విష్ణువర్ధన్, మన్సూర్‌అలీఖాన్ కూడా పాల్గొన్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సికింద్రాబాద్ కోర్టులో 2024లో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ విష్ణువర్దన్, మన్సూర్‌అలీఖాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

