హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): టీ హబ్‌లో స్టార్టప్ కార్యకలాపాలను క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. శనివారం ప్రతినిధుల బృందం టీహబ్‌ను సందర్శించి, స్టార్టప్‌లతో ప్రత్యేకంగా సమావేశమై, సమస్యలు, పరిష్కారమార్గాలపై చర్చించారు. కొత్తగా వస్తున్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్ చేపడుతున్న వివిధ ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రతినిధులకు వివరించారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన పెట్రోలియం, సహజవాయువు విభా గం మంత్రిత్వ శాఖ పరిధిలోని నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌తో టీ హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. దీంతో నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.