40 ప్లస్‌కు క్యాన్సర్ స్క్రీనింగ్
క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగిస్తున్నది. ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సమాయత్తమవుతున్నది. 40 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని, పీహెచ్సీ స్థాయిలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు
త్వరలో పీహెచ్సీ స్థాయిలోనే పరీక్షలు
జిల్లా దవాఖానల్లోనూ కీమో, రేడియోథెరపీ సేవలు
ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.100 కోట్లు వ్యయం
ఎంఎన్జేలో రూ.94.41కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
ఎంఎన్జేలో చికిత్స పొందుతున్న 30 ఏండ్ల యువకుడితో మాట్లాడా. చిన్న వయస్సులోనే బీడీలు, సిగరెట్లు తాగడం అలవాటై, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడికి 12 ఏండ్ల కూతురు ఉన్నది. ఇది విని చాలా బాధనిపించింది. క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తిస్తే నియంత్రించవచ్చు. చివరిదశలో దవాఖానలకు వస్తే చాలా కష్టం. అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. -మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 : క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం సమరభేరి మోగిస్తున్నది. ప్రారంభ దశలోనే గుర్తించి, బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సమాయత్తమవుతున్నది. 40 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని, పీహెచ్సీ స్థాయిలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. భవిష్యత్తులో జిల్లా దవాఖానల్లోనూ కీమో, రేడియోథెరపీ సేవలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో రూ.94.41 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్‌కు భయపడాల్సిన పనిలేదని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్స కోసం ఏటా రూ.100 కోట్లు, ఎంఎన్‌జే ద్వారా మరో 50 కోట్లు ఖర్చు చేస్తున్నదని, ఏటా 15 వేల మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నదని వివరించారు. నిమ్స్‌లో కూడా క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. సీఎస్సార్ కింద అరబిందో ఫార్మా కంపెనీ నిర్మిస్తున్న 300 పడకలతో ఎంఎన్‌జే దవాఖాన సామర్థ్యం 750 పడకలకు పెరుగుతుందని వివరించారు. ఎంఎన్‌జేకు ఇచ్చే బడ్జెట్‌ను రెట్టింపు చేశామని, మరో 252 పోస్టులు మంజూరయ్యాయని, దవాఖాన విస్తరణకు నిలోఫర్ పాఠశాలకు చెందిన మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎంఎన్జేలో మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని, మార్చి నాటికి ఒక రోబోటిక్ థియేటర్‌తో సహా 8 మాడ్యులర్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా 3డీ టెక్నాలజీతో జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను ఎంఎన్జేలో చేయడం అభినందనీయమని అన్నారు. ఎంఎన్‌జే దవాఖానలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 24 స్పెషల్ రూమ్‌లు, నీనారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన 300 పడకల సామర్ధ్యం గల పేషెంట్ అటెండెంట్ బ్లాక్, రోటరీ క్లబ్ సమకూర్చిన మొబైల్ స్క్రీనింగ్ బస్సు, మరికొన్ని ఆధునిక యంత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎంఎన్‌జే దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత పాల్గొన్నారు.
4 టిమ్స్ దవాఖానలకు త్వరలో శంకుస్థాపన
సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 : టిమ్స్ తరహాలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో నిర్మించనున్న నాలుగు దవాఖానలకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వైద్య కళాశాలల నిర్మాణంపై శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్యశాఖ, తెలంగాణ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ), అర్అండ్బీ, టీఎస్ఐఐసీ అధికారులు, డిజైనింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎనిమిది వైద్య కాలేజీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పూర్తయితే వరంగల్ కూడా మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

