హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): నత్తనడకన సాగుతున్న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశా లు జారీ చేసినట్టు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి వివిధ రోడ్డు పనులపై వినతిపత్రం సమర్పించారు.
అ నంతరం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ , ఉప్పల్ – నారపల్లి ఫె్లైఓవర్ పను లు నిర్వహిస్తున్న సంస్థను టెర్మినేట్ చేసి కొత్త టెండర్లు పిలిచి పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) కోసం ప్రత్యేకంగా సమావే శం ఏర్పాటు చేసి సమీక్షిస్తానని గడరీ హా మీ ఇచ్చినట్టు తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారుల ను జాతీయ రహదారులుగా మార్చే అం శంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పం దించినట్టు చెప్పారు. రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతుల కోసం కేంద్ర అటవీ శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలవనున్నట్టు మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కారణంగా ట్రిపుల్ ఆర్, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే పనులు ఆలస్యం అయిన ట్టు కోమటిరెడ్డి చెప్పారు.