హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నేరెడ్మెట్లోని జిల్లావిద్యాశిక్షణాసంస్థ (డైట్కాలేజీ) గుర్తింపును నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉపసంహరించింది. నిబంధనలు పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నది. డీఈఐఈడీ, తెలుగు,ఉర్దూ పండిట్ కోర్సుల గుర్తింపును రద్దు చేసింది. ఫెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్(పీఏఆర్)ను సమర్పించకపోవడంతో పలుమార్లు నోటీసులు జారీచేసినా స్పందించకపోవడంతో ఎన్సీటీఈ సీరియస్గా పరిగణించి గుర్తింపును రద్దుచేసింది. ఇక నుంచి కొత్త అడ్మిషన్లు తీసుకోవద్దని, ప్రస్తుతం పలు కోర్సుల్లోని విద్యార్థులు తమ చదువులను పూర్తిచేయవచ్చని సూచించింది.