హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ అవసరాలకు సరిపడా విద్యుత్తును సమకూర్చుకొనే లక్ష్యం తో ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిం ది. హరిత విద్యుత్తు ఉత్పత్తిదారులకు విరివిగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. వచ్చే పదేండ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు 1.14 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం 15,623 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 2034-35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని భావిస్తున్నది. సోలార్, ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ, విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని, పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వాలని నిశ్చయించింది.
స్టాండర్డ్ లేబిలింగ్తో 30వేల కోట్ల ఆదా
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : స్టాండర్డ్ అండ్ లేబిలింగ్ కార్యక్రమంలో చేపట్టిన స్టార్ లేబిలింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) కోరింది. స్టార్ లేబిలింగ్ ఉన్న ఎలక్ట్రిక్ ఉపకరణాల వాడకంతో విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గుతాయ ని బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవరా తెలిపారు. ఈ ఒక్క ప్రయత్నంతో 109 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యిందని, 88 మిలియన్ టన్నుల కర్బన ఉద్ఘారాలు తగ్గాయని, ఏటా రూ. 30 కోట్లు ఆదా అయ్యాయని వెల్లడించారు. అధికారులకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమ ఉద్దేశాలను వివరించారు.