హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయానికి సమీపంలోని ఆర్జీఐఏ క్రాస్‌రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్‌ని ఆర్టీసీ ఏర్పాటు చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.