Bus Fire Accident | నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు టావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి, ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
దీంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే లగేజీ మొత్తం కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ – విజయవాడ ప్రధాన రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో సాంకేతిక లోపం వల్ల దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు pic.twitter.com/yaittXrGrT
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2026