ఓయూలో హాస్టళ్ల కూల్చివేతను విరమించుకోవాలి
ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్రయమిచ్చే ఈ1, ఈ2, డీ హాస్టళ్లను కూల్చివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని బీఆర్ఎస్వీ ప్రధానకార్యదర్శి కొంపెల్లి నరేశ్ డిమాండ్ చేశారు.
- నిరుద్యోగులకు నిలువనీడ లేకుండా చేస్తున్న రేవంత్
- బీఆర్ఎస్వీ నేత కొంపెల్లి నరేశ్ విమర్శ
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 2 : ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్రయమిచ్చే ఈ1, ఈ2, డీ హాస్టళ్లను కూల్చివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని బీఆర్ఎస్వీ ప్రధానకార్యదర్శి కొంపెల్లి నరేశ్ డిమాండ్ చేశారు. ఆ హాస్టళ్లకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వివిధ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం నరేశ్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు హైదరాబాద్ నగరంలో ఆశ్రయమిస్తున్న ఇటువంటి హాస్టళ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టి ఈ నిర్ణయం తీసుకున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులే సరైన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు నాగరాజు, సురేశ్, రోహన్, సతీశ్, శ్రవణ్, అరుణ్, మల్లేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

