KTR | ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు.. తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ : కేటీఆర్
KTR | ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు 80 ప్రశ్నలు, ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగారు.. అన్నింటికి సమాధానం చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు 80 ప్రశ్నలు, ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగారు.. అన్నింటికి సమాధానం చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లో ఈడీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా ఏసీబీకి రేవంత్ రెడ్డి దొరికిండు కాబట్టే నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టిచ్చిండు. రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే నా మీద ఈ ఈడీ విచారణ జరిపిస్తున్నారు. అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుంది. భారత న్యాయవ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కాకుండా ఇంకో నాలుగు రోజులకైనా ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాసం నాకుంది అని కేటీఆర్ చెప్పారు.
8 గంటలు వాళ్లు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారు. తప్పు చేయలేదు.. అరపైసా అవినీతి జరగలేదు. తప్పు చేసి ఉంటే రుజువు చేయండి.. ఏ శిక్షకైనా సిద్ధమని అధికారులకు చెప్పాను. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగాను. ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నేను తప్పు చేయలేదు.. తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు అని కేటీఆర్ మరోసారి తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా..? సీఎంకు కేటీఆర్ సవాల్
Road Accident | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. యాదాద్రి జిల్లా వాసులు నలుగురు మృతి
Revanth Reddy | ఇక ఢిల్లీని ఉద్ధరిస్తడట.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గప్పాలు..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

