KTR | ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనేదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఫీలవుతున్నాడు.. తిప్పి తిప్పి కొడితే నువ్వు కూడా మూడు ఫీట్లు లేవని సీఎంను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మా జగదీశ్ రెడ్డిని పట్టుకుని మూడు ఫీట్లు అన్నడు రేవంత్ రెడ్డి. ఆయనేదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు. నువ్వేదో పెద్ద పోటుగాడిలాగా మూడు ఫీట్లు అని డైలాగులు. మనది మనం మరిచిపోతే ఎట్ల. కొంచెం ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తదా..? కొద్దిగా నీకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తెత్తు షూ వేసుకుని.. ఎత్తెత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడివి అయిపోతావా..? అమితాబ్ బచ్చన్ అయిపోతావా..? అని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిలదీశారు.
మిస్ వరల్డ్ పోటీలు పెట్టి.. మిస్ ఇంగ్లండ్‌ను ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేధించినట్లు వార్తలు వచ్చాయి. నన్ను వేశ్యలాగా చూశారని, ఇంత నికృష్టపు ప్రభుత్వం ఎక్కడా లేదంటూ పోటీల్లో నుంచి మధ్యలో వెళ్లిపోయినట్లు ఆమె పేర్కొన్నారు. కనీసం ఆ నేతలపై యాక్షన్ తీసుకున్నావా..? రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంట గలిపినందుకు ఆడకూతుర్లకు క్షమాపణలు చెప్పావా..? నీదో ప్రభుత్వం.. నువ్వో ముఖ్యమంత్రివి. రోత మాటలు, నికృష్టపు డైలాగులతో వైఫల్యాలను దాచుకుంటున్నావ్ అని కేటీఆర్ మండిపడ్డారు.
వెన్నుపోటు పోవడం అనేది రేవంత్ రెడ్డి కొత్తేం కాదు.. వెన్నతో పెట్టిన విద్య.. నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి. నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు. ఈ రోజు ప్రజల నోట్లో మట్టి కొడుతుండు. త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకు ఇలాంటి నికృష్టుడు మనకు సీఎంగా ఉండడం మనందరికీ అవమానం. కేసీఆర్ ప్రభుత్వంలో పదేండ్లు రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళల్లో నీళ్లు ఉండకూదని నీళ్లు ఇచ్చాం. అనుక్షణం తపించి.. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారు. రైతుబంధు, రైతుబీమా పెట్టి తెలంగాణ రైతులను నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిండు. దాని గురించి కూడా రేవంత్ చిల్లర మాటలు మాట్లాడిండు. బనకచర్ల విషయంలో అడ్డంగా దొరికిపోయిండు కాబట్టి.. కుర్తిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.