KTR | సీఎం రేవంత్‌కు దమ్ముంటే… చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. కేటీఆర్ సవాల్
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే.. చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే.. చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో.. ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..? అని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే..
రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..?? అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..?? అని ప్రశ్నించారు.
రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో
తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా”. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం అని కేటీఆర్ హెచ్చరించారు.
సీఎం రేవంత్ కు దమ్ముంటే…
“చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాలి..రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..??
ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో..ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..??
రిమోట్ కంట్రోల్…— KTR (@KTRBRS) August 23, 2024
ఇవి కూడా చదవండి..
DGP Jitender | డీజీపీ జితేందర్‌ను కలిసిన మహిళా జర్నలిస్టులు
Telangana | మహిళా జర్నలిస్టులపై దాడి.. ఎట్టకేలకు స్పందించిన మహిళా కమిషన్
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- Crop Loans
- Delhi
- farmers
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

