KTR | హైదరాబాద్ : కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు.. 500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకరి పేరు రాసి పెట్టుకుంటా.. ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కాదు, వాడి తాత వాడి అయ్య దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు అని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మీరు భయడపడకండి.. కొంత మంది ఆకురౌడీలు, గుండాగాళ్లు ఓటు వేయకపోతే ఏమో చేస్తామని అంటున్నారట. 14 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుపాను వస్తది. టీఆర్ఎస్ ప్రభుత్వం 500 రోజుల్లో రాబోతుంది. కొంత మంది పోలీసోళ్లు నకరాలు ఎక్కువ చేస్తున్నారు. పేర్లు రాసిపెట్టుకుంటాం. ఏ పోలీసోడు అయితే నకరాలు చేస్తుండో వారి తోక కట్ చేసే బాధ్యత నాది. రెండేండ్లలో ప్రభుత్వం వస్తది.. ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నాడో.. పోలీసోడు, ఆకురౌడీలు యాది పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కాదు వాని తాత, వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవరూ రక్షించలేడు. మా షరీఫ్‌ను తీసుకుపోయి ఏదో బలిమిటికి కండువా కప్పినట్టు అనుకున్నారా.. 14 నాడు చూపెడతది తెలంగాణ తన సత్తా. జూబ్లీహిల్స్ ఆడబిడ్డలు చూపిస్తరు సత్తా ఏంటో. ఇవాళ అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు. 14వ తారీఖు నాడు దిమ్మ తిరుగతది కాంగ్రెసోళ్లకు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తినే ఆరు గ్యారెంటీలు అమలవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నట్లు సర్వేలో డౌన్ కాగానే అజారుద్దీన్‌ను మంత్రిని చేసిండు.. సినిమా వాళ్ల వద్దకు పోయిండు.. సీఎం, మంత్రులు గల్లీగల్లీలు తిరుగుతున్నారు. ఓడిపోతామన్న భయంతో ఇన్ని పనులు చేసినోడు ఓడగొడితే సచ్చుకుంటూ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాడు కదా..? ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడగోడితేనే తులం బంగారం, పెన్షన్లు వస్తాయి. ఒకవేళ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. నేను ఏం ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నరు ఎందుకు ఇయ్యాలే అని అనుకుంటడు రేవంత్ రెడ్డి. మోసం చేసినా కూడా అమాయకులైన ప్రజలు మళ్లీ నాకు ఓటేస్తున్నారు అని పథకాలు అమలు చేయడు రేవంత్ రెడ్డి. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు
500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకటి పేరు రాసి పెట్టుకుంటా
ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా
రేవంత్ రెడ్డి కాదు, వాడి తాత వాడి అయ్య దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు – కేటీఆర్ pic.twitter.com/JDuQwM3p6I
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2025