Harish Rao : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం ఉదయం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వెంబడి సుంకె రవిశంకర్‌తోపాటు పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదమంత్రాలతో హరీశ్‌రావును ఆశీర్వదించారు.