హైదరాబాద్/బంజారాహిల్స్, మే 28 (నమస్తే తెలంగాణ): ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసం, బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, సినీ రచయిత చిన్నికృష్ణ, పలువురు నాయకులతో కలిసి 150 కిలోల కేక్‌ను తోట చంద్రశేఖర్ కట్ చేశారు. గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుమేరకు జూబ్లీహిల్స్‌లో తన నివా సం దగ్గర చంద్రశేఖర్ మొక్కలు నాటారు.