Sircilla | సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. 12 డైరెక్టర్ స్థానాలకు గానూ గురువారం జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్లు గెలుపొందారు. ఇద్దరు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్, బీజేపీ తరఫున ఒక్కో అభ్యర్థి చొప్పున విజయం సాధించారు. గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒకరు బీఆర్ఎస్కే తన మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ మద్దతుదారుల సంఖ్య 9కి చేరింది. దీంతో చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. శుక్రవారం నాడు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
రాపెల్లి లక్ష్మీనారాయణ (బీఆర్ఎస్),
గుడ్ల సత్యానందం(ఇండిపెండెంట్ – బీఆర్ఎస్కు మద్దతు),
చొప్పదండి ప్రమోద్ (కాంగ్రెస్),
అడ్డగట్ల మురళీ(బీఆర్ఎస్),
పాటికుమార్ రాజు(బీఆర్ఎస్),
బుర్ర రాజు(బీఆర్ఎస్),
వేముల సుక్కమ్మ(బీఆర్ఎస్),
అడ్డగట్ల దేవదాస్(బీఆర్ఎస్),
ఎనగందుల శంకర్(బీఆర్ఎస్),
వలస హరిణీ(ఇండిపెండెంట్),
పత్తిపాక సురేశ్ (బీజేపీ),
కోడం సంజీవ్(బీఆర్ఎస్)