Pawan Kalyan | ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్కమాటనలేదు.. కాంగ్రెస్తోనే ప్రాంతీయ విద్వేషాలు : పవన్ కల్యాణ్
Pawan Kalyan | బీఆర్ఎస్ పదేళ్ల తెలంగాణ పాలనలో జనసేన పార్టీపై గాని, తనపై ఏనాడు ఆరోపణలు చేయలేదని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ ( BRS ) పదేళ్ల తెలంగాణ పాలనలో జనసేన పార్టీపై గాని, తనపైగాని ఏనాడు ఆరోపణలు చేయలేదని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) తెలిపారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్( Congress ) వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని ఆరోపించారు. గత 13 నెలలుగా తనను పర్సనల్గా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణకు రావొద్దని మంత్రుల స్థానంలో ఉన్న వ్యక్తులు బెదిరించడాన్ని జీర్ణించుకోలేకే మీ అయ్య జాగీరా అనే పదం వాడానని స్పష్టం చేశారు. తెలంగాణలో సభ పెట్టుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం, తెలంగాణలోకి రావొద్దనడం ప్రాథమిక హక్కుకు భంగమని అన్నారు.
తెలంగాణలోనే జనసేన పుట్టిందని, తెలంగాణలో లీడర్స్, కేడర్స్కు పార్టీకి ఉందని, సుమారు లక్షన్నర సభ్యత్వం ఉందని వెల్లడించారు. పార్టీ నాయకులు , కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ల కోసం పని చేయొద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, తన వంతు సహకారం అందించాలనుకోవడంలో తప్పేముందని అన్నారు. తెలంగాణలో పోటీ చేయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

