హైదరాబాద్ : టీవీ ఛానెల్ డిబేట్లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయిన సిరికొండ మధుసూధనాచారి నేతృత్వంలో.. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ తన ఫిర్యాదును ఛైర్మన్‌కు అందజేశారు. ఏబీఎన్ డిబేట్లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇటీవల ఏబీఎన్‌లో జరిగిన ఓ డిబేట్ సందర్భంగా రవీందర్ రావును గెట్అవుట్ అంటూ అవమానించారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు.
తక్కళ్లపల్లి రవీందర్ రావుతోపాటు వెళ్లి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతల్లో దేశపతి శ్రీనివాస్, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్‌రెడ్డి ఉన్నారు.