MLC Kavitha | యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. టేకులసోమారంలో సాగునీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయిన దృశ్యాలను చూసి కవిత చలించిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కింది అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే అని ఆమె పేర్కొన్నారు.
నీటి నిర్వహణ పై అవగాహన లేక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టింది. రైతులను అరిగోస పెడుతోన్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదిలేదు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు
ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువేయాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం టేకులసోమారంలో సాగునీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కింది.
నీటి నిర్వహణ పై అవగాహన లేక దుర్మార్గపు కాంగ్రెస్… pic.twitter.com/sHu710C2w8
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 5, 2025