మహిళా బిల్లుపై కవిత పోరాటం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్నారు.
- నేడు దేశ రాజధానిలో రౌండ్ టేబుల్ సమావేశం
- హాజరుకానున్న పలు పార్టీల నేతలు, మహిళా సంఘాలు
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్నారు. ఇటీవలే జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించిన ఆమె.. పోరాటం కొనసాగింపుగా బుధవారం ఢిల్లీ మెరీడియన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. మహిళా బిల్లు ఆమోదంతోపాటు ఇతర మహిళా సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. మహిళా బిల్లు ఆమోదానికి మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా దారికి తేవాలన్న వ్యూహంపై చర్చించనున్నారు. మహిళా బిల్లు ఆమోదం కోసం అన్ని వర్గాలను, పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు అయినా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు కోసం ఢిల్లీలో ఈ నెల 10న నిర్వహించిన ధర్నాకు మహిళలు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాల నుంచి భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

