MLC Kavitha | పల్లి రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం గారు.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
MLC Kavitha | వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
MLC Kavitha | వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క వ్యాపారుల మోసం, మరోపక్క ప్రభుత్వం శీతకన్ను వేయడం వల్ల వేరుశనగ రైతుల ఆందోళనతో మహబూబ్ నగర్ జిల్లా అట్టుడుకుతోందని అన్నారు.
పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతాంగం క్షమించబోదని అన్నారు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం మేల్కొని వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమిషన్ దారుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంతోపాటు నవాబ్‌పేట, గండీడ్, మ హ్మదాబాద్ మండలాల నుంచి రైతులు వందల క్వింటాళ్ల పల్ల్లిని మార్కెట్‌కు తెచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు 6,190, కనిష్ఠంగా రూ.3,300 ధర నిర్ణయించారు. వ్యాపారులు మాత్రం రూ.5,700 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు కన్నెర్ర చేశారు. దీనికితోడు తక్కువ తూకంతో మోసానికి పాల్పడుతున్నారని, వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళనకు దిగారు. దాదాపు 4 గంటలపాటు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. సమీపంలోని బోయపల్లి గేట్ వద్ద రైల్వే లైన్‌పై బైఠాయించారు. అదే సమయంలో అటుగా వస్తున్న గూడ్స్‌ను లోకో పైలట్ చాకచక్యంగా నిలిపివేశాడు. రూరల్, వన్ టౌన్ సీఐలు గాంధీనాయక్, అప్పయ్య ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎస్పీ జానకి రైతుల వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే లైన్‌పై ఉన్న రైతులను సముదాయించి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

