BRS MLC K Kavitha | కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పౌర పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఎంపికైన ప్రముఖ డాక్టర్ డీ నాగేశ్వర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వైద్య రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం సంతోషకరం అని తెలిపారు.
పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న మంద కృష్ణకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరం అని తెలిపారు.
పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన ధ్వైసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి శుభాకాంక్షలు.
అవధాన సరస్వతీ పీఠాన్ని స్థాపించి దశాబ్దాల కాలంగా తన ప్రవచనాలతో సమాజాన్ని జాగృతం చేస్తున్న పండితుడు నాగఫణి శర్మకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరం. pic.twitter.com/69zpDxKH8Q
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 25, 2025
పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు.
అనేక సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రజలను మెప్పిస్తున్న బాలకృష్ణ గారు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న ఆయనకు పద్మ అవార్డు రావడం… pic.twitter.com/4hc6MLu88w
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 25, 2025