Suspension | తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటుపడింది. సభ నుంచి ఇవాళ, రేపు రెండు రోజుల పాటు సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ అవినీతిని నిలదీస్తే.. బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నారని కారణం చూపుతూ సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ కుంభకోణాలపై హౌసింగ్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ కమిటీ వేయకుండా సభ్యులను సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, అనిల్ జాదవ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ, మహిపాల్ రెడ్డి మాణిక్ రావు, పద్మారావు గౌడ్, చింతా ప్రభాకర్, బండారు లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు గౌడ్, చింతా ప్రభాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ సంజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ , వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానందను రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం pic.twitter.com/b3zMciBICN
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026