Akhil | అఖిల్ ‘లెనిన్’లో డబుల్ క్లైమాక్స్ ట్విస్ట్ … ఏది ఫైనల్ అవుతుందోనని అందరిలో ఆసక్తి
Akhil | యువ హీరో అక్కినేని అఖిల్ తన తాజా చిత్రం లెనిన్తో కెరీర్లో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో రెండు వేర్వేరు క్లైమాక్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
Akhil | యువ హీరో అక్కినేని అఖిల్ తన తాజా చిత్రం లెనిన్తో కెరీర్లో మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో రెండు వేర్వేరు క్లైమాక్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మొదటి క్లైమాక్స్ పూర్తిగా మాస్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంటుందట. అభిమానులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
ఇక రెండో క్లైమాక్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. కథలో ఊహించని ట్విస్ట్‌తో పాటు హీరో పాత్రలో గ్రే షేడ్ కనిపించేలా డిజైన్ చేశారట. ముఖ్యంగా హీరో తీసుకునే నిర్ణయం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని, అదే సమయంలో ఈ ముగింపులో సీక్వెల్‌కు హింట్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు క్లైమాక్స్‌లలో చివరకు దేనిని ఫైనల్‌గా ఎంపిక చేస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్ట్ స్క్రీనింగ్‌ల తర్వాత లేదా ప్రేక్షకుల అభిరుచిని బట్టి మేకర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అఖిల్-భాగ్యశ్రీ జంట మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్‌కు కీలకంగా మారింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. డబుల్ క్లైమాక్స్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘లెనిన్’ సినిమా అఖిల్‌కు బ్రేక్ ఇస్తుందా? లేక మరోసారి నిరాశ పరుస్తుందా? అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

