KTR | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఫీజుల విడుదలకు ప్రభుత్వంపై కొట్లాడతామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్‌కు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
తెలంగాణ భవన్లో బుధవారం రోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం తక్షణమే రూ. 650 కోట్ల రూపాయలు చెల్లిస్తే తమ సమస్య చాలా వరకు తీరుతుందని వారు కేటీఆర్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం కారణంగా కాలేజ్ భవనాల అద్దె, స్టాఫ్‌కు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం రూ. 650 కోట్లు చెల్లిస్తే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలపై ఆధారపడిన దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు చెప్పారు. వెంటనే బకాయిలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన కేటీఆర్ ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేలా ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలోనూ కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వాల బకాయిలంటూ దిక్కుమాలిన మాటలు చెప్పకుండా వెంటనే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు అంతకు ముందున్న ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తాము చెల్లించామని కేటీఆర్ గుర్తు చేశారు. తప్పకుండా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లించే విషయంలో ప్రభుత్వాని నిలదీస్తామని తనను కలిసిన కాలేజీ యాజమాన్యాలకు హామీ ఇచ్చారు.
కేటీఆర్‌ను కలిసిన వారిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ యాద రామకృష్ణ సహా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ముఖ్య నేతల కోసమే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు : హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

