రోడ్ల మరమ్మతులో సీఎం నిర్లక్ష్యం!
ప్రభుత్వం గ్రామీణ రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ్ట అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నుంచి శెట్టిపల్లి కలాన్ వరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాదయాత్ర నిర్వహించగా, మద్దతుగా పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి పాల్గొన్నారు.
- వెల్దుర్తి -మెదక్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి
- పాదయాత్రలో మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
- మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి మద్దతు
మెదక్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం గ్రామీణ రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ్ట అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నుంచి శెట్టిపల్లి కలాన్ వరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాదయాత్ర నిర్వహించగా, మద్దతుగా పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి నుంచి మెదక్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేసేందుకు రూ. 18 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నిధులు రద్దు చేసిందని ఆరోపించారు. వెల్దుర్తి- మెదక్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సునీతారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, యాదవ్రెడ్డి నాయకులు, కార్యకర్తలతో చేరుకోగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో బీఆర్ఎస్ నాయకులు గేట్ ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. డీఆర్వోను కలిసి వెల్దుర్తి -మెదక్ రోడ్డును బీటి రోడ్డుగా నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

