ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 4 : ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని పాత బస్స్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటం పెట్టి పిండ ప్రదానం చేశారు.
పిండ ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు 20 మంది బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.