BRS Leaders | గాంధీ హాస్పిటల్ వద్ద పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BRS Leaders | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
BRS Leaders | హైదరాబాద్ : నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డితో పాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డి పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి పట్ల కనీస మర్యాద పాటించలేదు పోలీసులు. రాకేశ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిని లాక్కెళ్లి పోలీసు వాహనాలను ఎక్కించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. గాంధీ హాస్పిటల్ వద్ద పోలీసుల తీరుపై పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్‌కు బీఆర్ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
నిరుద్యోగులకు, మరియు గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీ లాల్ కు సంఘీభావం తెలపడానికి గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని, రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/mI0CQcFS8V pic.twitter.com/n6hcvxN1hg
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

