కరువుపై పెంట్లవెల్లిలో బీఆర్ఎస్ ధర్నా
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిని కరువు మండలం గా ప్రకటించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
- తహసీల్దార్ కాళ్లు పట్టుకున్న అన్నదాత
పెంట్లవెల్లి/నవాబ్‌పేట, అక్టోబర్ 29 : నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిని కరువు మండలం గా ప్రకటించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం పెంట్లవెల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాదాపు 200వందల మంది రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో సుమారు 1,200 ఎకరాల్లో పంటలు ఎండిపోయిందని, పెట్టుబడులు సైతం తీర్చే పరిస్థితుల్లో రైతులు లేరని అన్నారు.
వెంటనే రైతులకు పరిహారం చెల్లించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు పెంట్లవెల్లి అంటేనే మొదటి నుంచీ చిన్నచూపని, ఆ కారణంగానే ఈ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదని వారు విమర్శించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ భాస్కర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు పెంట్లవెల్లిని కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్ కాళ్లు పట్టుకొని వేడుకున్నారు.

నవాబ్‌పేటలో ధర్నా
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సిములు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయాయని, భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోయాయని తెలిపారు. మండలంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ఇక్కడ కరువు లేదని.. మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించక పోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. నాలుగైదు రోజుల్లో కరువు మండలంగా ప్రకటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

