RSP | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్.. అన్నీ సీఎం రేవంత్ రెడ్డినే అని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో శాఖాధిపతులు కేవలం ఉత్సవ విగ్రహాలే అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
మరి సీఎస్, డీజీపీ, పీసీసీఎఫ్‌లు కేవలం ఏసీ గదుల్లో కూర్చోని లక్షల జీతాలు తీసుకోవడానికేనా? కేటీఆర్, హరీష్ రావు మీద అక్రమ కేసులు, పీసీసీఎఫ్‌ను బైపాస్ చేయడం చూస్తే నిజమే అనిపిస్తుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో తప్పులేదు, కానీ బిజినెస్ రూల్స్ ఫాలో కావాలి కదా? రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? అసలే మీ దురాశలకు, తప్పులకు రోజూ అధికారులను బలిచేస్తున్నరు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
నేడు అటవీ శాఖలో ఉన్నత స్థాయి అధికారికి చెప్పకుండా ఆ శాఖ అధికారులను విదేశీ పర్యటనకు పంపడం అనేది అధికారులను అణిచివేసే కుట్రే. ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రి వర్గమో లేదా ఎమ్మెల్యేలో విదేశాలకు వెళ్తే సీఎం ఏం చేసేవారు? ప్రిన్సిపల్ ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డోబ్రియాల్ సీనియర్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. ఈ అధికారికి ఒక మాటైనా చెప్పకుండా ఇతర అధికారులను విదేశీ పర్యటనకు పంపడం ఆ అధికారిని అవమానించడం కాదా? హెచ్‌వోడీ రికమెండేషన్ లేకుండా అసలు భారత ప్రభుత్వం ఏ విధంగా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చింది?? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, IAS,IPS, IFS Etc
అన్నీ సీయం గారే. ఇందిరమ్మ రాజ్యం లో శాఖాధిపతులు కేవలం ఉత్సవ విగ్రహాలే.మరి సీయస్, డీజీపి, పీసీసీఎఫ్ లు కేవలం ఏసీ గదుల్లో కూర్చోని లక్షల జీతాలు తీసుకోవడానికేనా? కేటీఆర్, హరీష్ రావు గార్ల మీద అక్రమ కేసులు, పీసీసీఎఫ్ ను బైపాస్ చేయడం చూస్తే… pic.twitter.com/pL0GdJYjfg
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 2, 2025