ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి సీజన్‌కు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. అందులో ఇటీవలి కాలంలో యువత నుంచి సెలెబ్రిటీల వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ైస్టెల్ స్కార్ఫ్ టాప్. ఇది సింపుల్‌గా కనిపించినా, ధరించినప్పుడు ఇచ్చే లుక్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్కార్ఫ్‌ను పోలి ఉండే వస్త్రంతో తయారైన ఈ టాప్‌లు సాధారణ టాప్ల కంటే కాస్త ఫ్లోయింగ్, అసిమెట్రిక్ కట్లతో ఉంటాయి. కొన్ని మెడ చుట్టూ కట్టుకునే మాడల్ అయితే, మరికొన్ని ఒకవైపు పడినట్టు ఉండే డ్రేప్ డిజైన్‌లో కనిపిస్తాయి.

బెల్టుతో ధరిస్తే వేరే లుక్, లూజ్‌గా వేసుకుంటే మరో లుక్. ఒకే టాప్‌ను వివిధ రీతుల్లో ైస్టెల్ చేయవచ్చు. జీన్స్, స్కర్ట్, పలాజో లాంటి వాటితో ఈ టాప్‌లు చక్కగా మ్యాచ్ అవుతాయి. రోజువారీ నుంచి పార్టీల వరకూ ఉపయోగించవచ్చు. ఎలా వేసుకున్నా ట్రెండీగా కనిపించడం వీటి ప్రత్యేకత. సింపుల్‌గా ఉంటూనే స్టేట్మెంట్ పీస్‌లా కనిపిస్తాయివి. అందులోనూ తేలికగా, సౌకర్యంగా ఉండే వీటిని అమ్మాయిలు ఇప్పుడు తెగ ఇష్టపడుతున్నారు.