తల్లిదండ్రులు కూడా వెంటనే ఆగ్రహానికి గురికావొద్దు. పెద్దల కోపం.. పిల్లల ఆవేశాన్ని మరింత పెంచుతుంది. ఇక, కోపం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు.. ఏ విషయం గురించైనా చర్చించడం వృథా. కాసేపు ఆగి.. ప్రశాంతంగా మాట్లాడుకుందామని చెప్పాలి. ఆ ఉద్రిక్త వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చడానికి ప్రయత్నించాలి.