RS Praveen Kumar | రూ. 100 కోట్లు సంపాదించడానికి.. వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు.. రేవంత్‌కు ఆర్ఎస్పీ చురకలు
RS Praveen Kumar | ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. 100 కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ... కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఉద్యోగార్థులకు మళ్లీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ఒక్కో సెంటర్‌కు రూ.100 కోట్ల లాభాలు వస్తాయని ఆ సెంటర్లు ఆశపడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. 100 కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ… కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
ఇక నిరుద్యోగులను కిరాయి మనుషులనడం మీకే చెల్లు. ఆనాడు రాహుల్ గాంధీని అశోక్ నగర్‌కు తీసుకొచ్చినపుడు మీ వెంబడి వచ్చిన వాళ్లందరు కిరాయి మనుషులేనా? అని అడిగారు ఆర్ఎస్పీ.
ఆ తేడా తెలవకపోవడం తెలంగాణ నిరుద్యోగుల దురదృష్టం..
వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలిచ్చిండ్రా? తమరికి ఉద్యోగాల నోటిఫికేషన్‌కు, నియామకాలకు తేడా తెలవకపోవడం తెలంగాణ నిరుద్యోగుల దురదృష్టం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో 1:50 నుండి 1:100 చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేయలేం? అని ప్రశ్నించారు. మీరు సిలబస్ లేదా పరీక్ష సరళిని మార్చడం లేదు. కేవలం మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను మార్చాలి. ఈ విషయంలో పరిష్కారం చెప్పమని అడ్వకేట్ జనరల్‌ని అడిగారా.? అని ప్రశ్నించారు.
ఒక్క రూపాయికే కోచింగ్ అందించారు..
ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ సర్ ఒక్క రూపాయికే గ్రూప్-2, 3 కోచింగ్ అందిస్తున్నారు. అలాగే గ్రూప్స్ వాయిదా అనంతరం చాలా కోచింగ్ సెంటర్స్ రూపాయి ధరకే కోచింగ్ అందించాయి. పేద విద్యార్థులకు సాయం చేశారు. మీకు దగ్గరున్న పక్క రాష్ట్ర కోచింగ్ సెంటర్ల లాగా లక్షలు కడితేనే టెస్టు సీరిస్ ఇస్తం అనే సంస్కృతి తెలంగాణ బిడ్డలకు లేదు. అందుకే అశోక్ వెనక వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి మద్దతు ఇస్తున్నారు.
అసలు ప్రాబ్లం ఏందంటే..?
మీకు నిరుద్యోగుల గోస అర్థం అయితలేదు. అర్థం చేసుకునే ప్రయత్నమూ చెయ్యడం లేదు. మీ చుట్టూ ఉన్న సోకాల్డ్ మేధావులేమో పదవుల వేటలో ఉన్నరు. నిరుద్యోగులను వాడుకొని పదవుల్లో ఉన్నోళ్లకేమో పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేదు. వచ్చిన పదవులను కాపాడుకోవడానికి వాళ్లు బౌన్సర్లు, బూతులను నమ్ముకున్నరు. ఇక అధికారులేమో తమరిని నిరంతరం ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నరు. వాళ్లకు పరిష్కారం తెలవక కాదు, కానీ మీకు పరిష్కారం ఇష్టం లేదు కాబట్టి వాళ్లు మీకు అసలు విషయం చెప్పడం లేదు. కావాలంటే మీరు ఈ రోజు మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పి చూడండి. సాయంత్రం కల్లా వాళ్లు మీకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తరు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
మరి మిమ్మల్ని ఏమనాలి..?
మీకేమో ప్రతీదీ రాజకీయ కుట్ర లాగనే కనిపిస్తున్నది. నిరుద్యోగులకు సంఘీభావంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని తలకుమాసినోడని మీరంటున్నరు! మరి మీరు కూడా 2023లో ఇదే పని చేసిండ్రు కదా? మరి మిమ్మల్ని ఏమనాలి? ఆనాడు చిక్కడపల్లికి వచ్చిన రాహుల్ గాంధీని ఏమనాలి?? అసలు ప్రజాసమస్యలపై మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలకు లేదంటారా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
మీరు ప్రతి విషయాన్ని రాజకీయ, వాణిజ్య కోణంలో చూడటం మానేయాలి సర్. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఆచరణాత్మకమైన పరిష్కారానికి మీరు చేరువ అవుతారు. అసలు మీ మనసులో ఏం ఉందో తెలుసుకోవాలనే కుతుహలం ఉందని ఆర్ఎస్పీ అన్నారు.
ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వంద కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ… కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడు!
ఇక నిరుద్యోగులను కిరాయి మనుషులనడం మీకే చెల్లు. ఆనాడు @RahulGandhi గారిని అశోక్ నగర్ కు తీసుకొచ్చినపుడు మీ… pic.twitter.com/qULWax1WVp— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

