RS Praveen | తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా.. దయచేసి దాని జాడ చెప్పండి : ఆర్ఎస్ ప్రవీణ్
RS Praveen | కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని, కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్‌కు పిలువకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని బీఆర్ఎస్ కీలక నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
RS Praveen : కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని, కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్‌కు పిలువకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని బీఆర్ఎస్ కీలక నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఈ మేరకు నియామక పత్రం అందుకుని ట్రెయినింగ్ కోసం ఎదురుచూస్తున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ రాసిన లేఖను ఆయన తన పోస్టుకు జత చేశారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన చేతిలో ఏమీ లేదని చెప్పినట్టుగా బాధితులు ఆవేదన చెందుతున్నారని తను ఎక్స్‌లో పోస్ట్ చేసిన లేఖలో ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా అని ప్రశ్నించారు. అది (ప్రభుత్వం) కనిపిస్తే దయచేసి దాని జాడ చెప్పిండంటూ వ్యంగ్య ధోరణిలో తన ఎక్స్ ఫాలోవర్స్‌ను కోరారు.
ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారి చేతుల మీదుగా నియామకపత్రాలు తీసుకున్న 614 మంది ఎక్సైజు కానిస్టేబుళ్లు ట్రైనింగ్ కు పోకుండా గత నలభై రోజుల నుండి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఎక్సైజు శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నా చేతిలో ఏంలేదు… pic.twitter.com/TgybCNybPw— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 27, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

