పాలన చేతగాకే వ్యక్తిత్వ హననం
పాలన చేతగాక, ప్రజా సమస్యలు పరిష్కరించ లేక అధికార కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి, రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా రాష్ర్టాభివృద్ధికి విశేష కృషి చేసిన కేటీఆర్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు ఎక్కడిది? అని నిలదీశారు.
- కేటీఆర్‌ను విమర్శించే అర్హత బల్మూరికి ఎక్కడిది?
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పాలన చేతగాక, ప్రజా సమస్యలు పరిష్కరించ లేక అధికార కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి, రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రిగా రాష్ర్టాభివృద్ధికి విశేష కృషి చేసిన కేటీఆర్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు ఎక్కడిది? అని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ కాంగ్రెస్, బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బల్మూరి కాయకచోరీ లీడర్..
సీఎం రేవంత్‌రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం బల్మూరి వెంకట్, కేటీఆర్‌పై ఎగిరెగిరిపడుతున్నాడని రాకేశ్‌కుమార్ విరుచుకుపడ్డారు. ఆయన ప్రజానాయకుడు కాదని, కాయకచోరీ లీడర్ అని దెప్పిపొడిచారు. హుజూరాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు కూడా రాని బల్మూరికి సిరిసిల్ల నుంచి ఏడుసార్లు గెలిచిన కేటీఆర్‌ను విమర్శించేస్థాయి ఎక్కడిది? అని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీగా విఫలమయ్యారని, ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చుచేయలేని అసమర్థుడని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహాన్ని పెట్టి కేసీఆర్ గౌరవిస్తే, ఆయన మనువడు వంశీకృష్ణ కారుకూతలు కూయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేత గౌతంప్రసాద్ మాట్లాడుతూ.. ఎంపీగా వంశీకృష్ణ, మంత్రిగా వివేక్ వెంకటస్వామి ప్రజలను ఉద్ధరిస్తున్నదేంది? అని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

