రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే!
కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించి, హైదరాబాద్ నడిబొడ్డున మరో భారీ భూ భాగోతానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘హైటెక్ సిటీ పక్కన ఇజ్జత్‌నగర్, మోకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పటాన్చెరు, గాజులరామారం, జవహర్‌నగర్ ప్రాంతాల్లోని 817.32 ఎకరాలను ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా తాకట్టుపెట్టింది. రూ.12, 818 కోట్లకుపైగా రుణం తీసుకున్నది.
- 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్
- జెన్ప్యాక్ట్కు కేటాయించిన భూమి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు
- విచ్చలవిడిగా భూములు కొల్లగొడుతున్న రేవంత్ కుటుంబం
- దమ్ముంటే మా ఆరోపణలకు సీఎం సమాధానమివ్వాలి
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం బరితెగించి, హైదరాబాద్ నడిబొడ్డున మరో భారీ భూ భాగోతానికి తెరలేపిందని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ‘హైటెక్ సిటీ పక్కన ఇజ్జత్‌నగర్, మోకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పటాన్చెరు, గాజులరామారం, జవహర్‌నగర్ ప్రాంతాల్లోని 817.32 ఎకరాలను ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా తాకట్టుపెట్టింది. రూ.12, 818 కోట్లకుపైగా రుణం తీసుకున్నది.
ఇందులో ఇప్పటికే హెచ్ఎండీఏ ఖాతాలో రూ.10 వేల కోట్లు నగదు జమైంది’ అని పేర్కొన్నారు. మన్నె క్రిశాంక్ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను విడుదల చేశారు. రేవంత్ బీఆర్ఎస్ నేతలపై బురదజల్లుతున్నారని, కానీ ఆయనపై వచ్చిన ఆరోపణలకు మాత్రం ఎందుకు సమాధానం చెప్పడంలేదు? అని ప్రశ్నించారు. గతంలో కేటీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు చేస్తే, వారు తెల్లారే బదులిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ మాత్రం తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలకు ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. ఆయనకు దమ్ముంటే ఇప్పటికైనా బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.
రూ.100 కోట్ల భూమి.. రూ.15 కోట్లకే
ప్రభుత్వం తాకట్టు పెట్టిన భూముల మార్కెట్ విలువ సగటున ఎకరాకు రూ.100 కోట్ల వరకు ఉన్నదని క్రిశాంక్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఈ విలువను రూ.15 కోట్లుగా చూపిందన్నారు. ఇలా మొత్తంగా రూ.50 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల వరకు పలికే భూములను కేవలం రూ.12 వేల కోట్లుగా చూపిందని ఆరోపించారు. ముంబైకి చెందిన బికన్ట్రస్ట్ను దళారీగా పెట్టి ఈ రుణం తీసుకున్నదని పేర్కొన్నారు.
మార్చి 31వరకు హెచ్ఎండీఏ ఖాతాల్లో కేవలం రూ.275 కోట్లు ఉండగా, జూన్ నెలాఖరు వరకు రూ.10 వేల కోట్లు జమయ్యాయని వివరించారు. ఇందుకు తగిన ఆధారాలు చూపించారు. నిరుడు హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను తాకట్టుపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించగా, విద్యార్థులు వీరోచితంగా పోరాడి కాపాడుకున్నారని గుర్తుచేశారు. కేటీఆర్ పోరాటంతో సుప్రీంకోర్టు సైతం రేవంత్ విధానాన్ని తప్పుబట్టిందన్నారు. కానీ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి నేరాలకు రుచిమరిగినట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా, గుట్టుచప్పుడు కాకుండా ఇప్పుడు ఏకంగా సుమారు 818 ఎకరాలను ముంబైకి చెందిన బ్యాంకుకు తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు.
ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని ఆశించిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతూ, డబ్బులు దండుకొనే పనిలో పడ్డదని క్రిశాంక్ విమర్శించారు. ప్రశ్నించిన ప్రతిసారి కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నదని దుయ్యబట్టారు. ‘నేను మీడియా సమావేశం పెడితే వణికిపోయిన కాంగ్రెస్.. తన సోషల్‌మీడియా హ్యాండిల్స్ ద్వారా వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నది. ప్రశ్నించిన ప్రతిసారి నా కుటుంబసభ్యులపై సోషల్ మీడియా ద్వారా బురదజల్లుతున్నది. ఇంటిపైకి పోలీసులను పంపి నా ఏడేండ్ల పాపను కూడా భయపెడుతున్నది. నా ఇంటివద్ద గుర్తుతెలియని వ్యక్తులను కాపాలా ఉంచుతున్నది’ అని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులు, దబాయింపులకు భయపడేదిలేదని, ప్రశ్నించడం ఆపేదిలేదని తేల్చి చెప్పారు.
జెన్‌ప్యాక్ట్ భూమిలో రేవంత్ బినామీ కంపెనీ కబ్జా
జవహర్‌నగర్‌లోని సర్వే నంబర్ 12బీ లోని 50 ఎకరాలను 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జెన్‌ప్యాక్ట్ అనే ఐటీ సంస్థకు కేటాయించిందని క్రిశాంక్ తెలిపారు. సుమారు రూ.5 వేల కోట్ల విలువైన ఈ భూములను సీఎం రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీ, నెల్లూరుకు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కబ్జా చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూపారు. అక్కడ ప్రస్తుతం జెన్‌ప్యాక్ట్ సంస్థకు చెందిన బోర్డుతోపాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు చెందిన కంటైనర్ ఉన్నదని స్పష్టంచేశారు.
‘జెన్ప్యాక్ట్కు కేటాయించిన భూములతో కేఎల్‌ఎస్‌ఆర్‌కు ఏం సంబంధం? రేవంత్‌రెడ్డి ఆ భూములను బదిలీ చేశారా? రూ.5వేల కోట్ల విలువచేసే భూమిని రేవంత్ బినామీకి ఎందుకు ఇచ్చారు? కేటాయించిన సంస్థ వినియోగించుకోకుంటే స్వాధీనం చేసుకోవాల్సిన ప్రభుత్వం, నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు ఇచ్చింది?’ అని సూటిగా ప్రశ్నించారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ల్యాండ్ క్రూజర్ కారు (టీఎస్077ఎఫ్ఎఫ్0009)ను గిఫ్ట్‌గా ఇచ్చిందని గుర్తుచేశారు. నాడు కారు ఇచ్చిన సంస్థకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంట్రాక్టులు కట్టబెడుతూనే ఉన్నారని ఎద్దేవాచేశారు.
అనకొండలా అనుముల ఫ్యామిలీ
అనుముల ఫ్యామిలీ అనకొండలా మారి తెలంగాణ భూములు, ఆస్తులను తెగనమ్ముతున్నదని క్రిశాంక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కుటుంబ అక్రమాలపై కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నించినందుకే.. ఎర్రవల్లిలో భూములను కేసీఆర్ కబ్జా చేశారంటూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. కానీ అక్కడి దళితులే కేసీఆర్ తమ భూములు తీసుకోలేదంటూ వాస్తవాలు బయటపెట్టారని గుర్తుచేశారు. కొందరు ఇది రెండు పార్టీ నేతల మధ్య ఆస్తుల పంచాయితీగా చిత్రీకరిస్తుండడాన్ని కొట్టిపారేశారు.
‘రేవంత్‌రెడ్డి సతీమణి పేరిట హ్యూందాయ్ కార్ల కంపెనీ వ్యవహారం, తొమ్మిదో తరగతి ఫెయిలైన అనుమల కొండల్‌రెడ్డి ఎరోస్సేస్ ఎక్స్పర్ట్ అవడం, తిరుపతి రెడ్డికి కల్పిస్తున్న వీవీఐపీ మర్యాదలు, జగదీశ్‌రెడ్డి స్వచ్ఛ్ బయో కంపెనీ పెట్టి రూ.వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకోవడం, సీఎం కూతురు నైమిషారెడ్డి కార్పొరేట్ స్కూళ్లు, అల్లుడు సత్యనారాయణ మ్యాక్స్బిన్ ఫార్మా.. గురించి అందరికి తెలిసిపోయింది’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజ ల ఆస్తులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నాయకులు చిల్లర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణా.. కేటీఆర్ వెంట్రుకలు లెక్కబెట్టేందుకే పెద్దపల్లి ప్రజలు నీకు ఓటేశారా? ప్రజల సమస్యలను పట్టించుకోరా?’అని నిలదీశారు. మొన్న రేవంత్‌రెడ్డి రూ.52 వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టామని, ఇప్పుడు ఆయన హైదరాబాద్ నడిబొడ్డున సాగించిన భూ బాగోతాన్ని బట్టబయలు చేశామని, మున్ముందు సీఎం అవినీతి చిట్టాను ప్రజల ముందు పెడుతామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

