Dasoju Sravan | రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునక ఈ ఉప ఎన్నిక : దాసోజు శ్రవణ్
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా తిరిగారు. దుర్మార్గమైన రీతిలో ఎన్నికలు నిర్వహించారు అని ఆయన అన్నారు.
Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా తిరిగారు. దుర్మార్గమైన రీతిలో ఎన్నికలు నిర్వహించారు అని ఆయన అన్నారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఆమె పిల్లలను బెదిరించారు. 139 డ్రోన్లు పెట్టామన్నారు.. సందు సందులో గూండాలున్నారు. అయినా కూడా యువకులు, మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లో రాయలసీమ, బీహార్ మాదిరిగా అరాచకం జరిగింది. ఈ ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. లక్ష మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డబ్బు వద్దన్న ఓటర్లను బెదిరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఉందా..? లేదా..? 20 సార్లు ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించలేదు. మంత్రులందరూ ఎలక్షన్ రూల్స్‌ను ఉల్లంఘించారు అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే వందల మంది దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నేతలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇటువంటి ఎన్నిక గతంలో ఎన్నడూ చూడలేదు. రేవంత్ రెడ్డికి ప్రజల మీద నమ్మకం పోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేశాడు. తెలంగాణలో రౌడీయిజం చూపించబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ గుడ్డి గుర్రంలా తయారైంది. ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీజీపీ, సీపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారారు. స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారని చెప్పినా పట్టించుకోలేదు. పారామౌంట్ కాలనీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టేబుల్స్ తీసేశారు. ఒక్క కాంగ్రెస్ నేతపైన అయినా దాడి జరిగిందా..? తప్పుడు ఐడీ కార్డులతో వస్తున్నారు చెక్ చేయమన్నా స్పందన లేదు. పోలింగ్ బూతుల్లో బీఆర్ఎస్ ఏజెంట్లను సైతం బెదిరించారు. బీఆర్ఎస్ నేతలపై అడుగడుగునా దాడులు జరిగాయి. బిర్యాని పొట్లాల్లో డబ్బులు పెట్టి ఇస్తున్నారని చెప్పినా పట్టించుకోలేదు. ఒక్కరి మీదైనా చర్యలు తీసుకొమ్మని సుదర్శన్ రెడ్డిని బతిమిలాడిన కూడా స్పందించలేదని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

