Bakka Judson | తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నాలుగు నెలల వ్యవధిలోనే అనేక విమర్శల పాలైంది. ప్రతిపక్షాల విమర్శలు సరేసరి.. చివరకు సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిపై తిరగబడే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి.. పదవులను కాపాడుకునేందుకు చేస్తున్న కుటిల రాజకీయాలపై పలువురు కాంగ్రెస్ సీనియర్లు గొంతెత్తి ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన వారిలో బలైన సీనియర్ నేత బక్క జడ్సన్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కాంగ్రెస్ పార్టీ బక్క జడ్సన్‌పై వేటు వేసింది. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్ల కొనుగోళ్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని జడ్సన్ పేర్కొన్నారు. దీంతో బక్క జడ్సన్‌ను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు జడ్సన్‌పై వేటు వేసిందుకు గానూ.. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బక్క జడ్సన్ రాయని పద్యం అంటూ ఆయన మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్వేగంతో రాసిన ఆ వ్యాఖ్యలు ప్రతి ఎస్సీ నాయకుడిని ఆలోచించజేస్తున్నాయి.
జడ్సన్ రాయని పద్యం
ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు
మనుషులను లేకుండా చేసి జీవచ్ఛవాలుగా మారి
మీరే ఏలండి
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు
మీలో మీరే అమ్మనక్కని బూతులు తిట్టుకోండి
మీరే తన్నుకోండి
కాంగ్రెస్ ను మీరే పంచుకోండి
మీ మలినాన్ని మోస్తున్నందుకు మేము వేల ఏండ్లనుంచే ఊరవతల విసిరేయబడ్డోల్లం
బహిష్కరణ మాకు కొత్తగాదురా..
మీ దోపిడీకి బలైపోతున్న సమాజం లో నిలబడి కొడవళ్లు ఎత్తిన ప్రతీసారి కొవ్వొత్తులై కరుగుతానే ఉన్నాం..
మమ్మల్ని మేము విముక్తం చేసుకునే ప్రతి సందర్భంలో వివక్షను ఎదుర్కుంటూనే వున్నాం..
ఏ బహుజనుల త్యాగాల మీద
ఏ దళితుల ప్రాణాల పునాదుల మీద
నా కాంగ్రేస్ పార్టీ నిలబడ్డదో
దాని మూలాలను పెకిలిస్తున్నమీకు మాదిగ బిడ్డ ఉసురు తప్పకుంటా తగులుతుంది..
కాళ్లుండి వంకర నడక నడుస్తున్న మిమ్మల్ని సక్కగ జేయాల్నని చూసిన ఓ నాలాంటి వాన్ని బయటకు గెంటేయాల్నని చూసిన మీ దుర్మార్గం బద్దలుకాక తప్పదు..
“అకారణంగా ఓ అశక్తుణ్ణి హింసించిన వాడెవడూ సుఖపడబోడని” భారతం ఏనాడో చెప్పింది మీకు ఆ గతి తప్పదు..
ఒక్క బక్కోడైన బక్క జడ్సన్ ను మీరు బహిష్కరించినమని సంబుర పడుతుర్రేమో..
మీరు గెంటివేసింది ముక్కోటి తెలంగాణ బహుజన ఆత్మలను
మీరు బహిష్కరించింది మీకు అధికారం కట్టబెట్టిన సబ్బండ వర్గాల తన్లాటను
రూమీ టోపీ నుంచి గాంధీ టోపీ దాకా ఆనుంచి ఏ ఎండకాగొడుగు పట్టేదాకా సాగిన మీ ప్రయాణం
కూచున్న కొమ్మనే నరికేసుకునే దుర్మార్గానికి తెగబడ్డది..
బాయిల బడ్డ కుక్క తీయబోయిన కరుస్ధది..
అట్లున్నది మీ అభద్రత..
మీ కబంధ హస్తాల్లో చిక్కిన కాంగ్రెస్ ను ఎవ్వడూ కాపాడలేడిప్పుడూ
స్వాతంత్ర్యాన్ని తెచ్చి
జాతిని విముక్తం చేసిన మూడురంగుల జెండాను నేడు ఒక తెలంగాణ భూస్వామ్య సామాజికవర్గం చెరబట్టింది
నాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన చేతులే నేడు అన్యాయమని ఎలుగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి.
మూల్యం చెల్లించుకుంటాయి..
।। జడ్సన్ రాయని పద్యం ।।
ఒరేయ్ మీరే ఏలండిరా రాజ్యాలు
మనుషులను లేకుండా చేసి జీవచ్ఛవాలుగా మారి
మీరే ఏలండిదొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు
మీలో మీరే అమ్మనక్కని బూతులు తిట్టుకోండి
మీరే తన్నుకోండి
కాంగ్రెస్ ను మీరే పంచుకోండిమీ మలినాన్ని మోస్తున్నందుకు మీము వేల ఏండ్లనుంచే ఊరవతల…
— Balka Suman (@balkasumantrs) April 4, 2024