హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాహల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కశ్మీర్ పాకిస్థాన్‌లో ఉన్నట్టు చూపెట్టడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యేకు దేశ పటంపై కనీస అవగాహన లేదని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సోషల్ స్టడీస్‌లో స్పెషల్ కోచింగ్ ఇవ్వాలని సూచించారు. రాజకీయాల్లో ఉన్నవారికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదని, దేశం పట్ల బాధ్యత, నడవడికలో పరిణతి కూడా ఉండాలని సూచించారు.